Home Page SliderInternationalNews AlertSpiritual

వాటికన్ సిటీలో పోప్‌ ఫ్రాన్సిస్‌ కన్నుమూత

ఈస్టర్ సందేశం ఇచ్చిన మరునాడే క్రైస్తవ మతపెద్ద పోప్‌ ఫ్రాన్సిస్‌ (88) కన్నుమూశారు. దీనితో వాటికన్ సిటీతో పాటు ప్రపంచవ్యాప్తంగా విషాదఛాయలు అలముకున్నాయి. ఆయన ఆదివారం ఈస్టర్ వేడుకలకు హాజరై, సందేశం కూడా వినిపించారు. గత కొంత కాలంగా శ్వాసకోశ వ్యాధితో బాధ పడుతున్నారు. ఆయన 2013లో పోప్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఎల్లప్పుడూ సామాజిక న్యాయం, పర్యావరణ సంరక్షణ వంటి విషయాల గురించి చక్కటి ప్రసంగాలు ఇచ్చేవారు. లాటిన్‌ అమెరికా నుంచి పోప్‌గా ఎంపికై అరుదైన రికార్డును ఆయన సొంతం చేసుకున్నారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని, ఇజ్రాయెల్-హమాస్‌ల మధ్య యుద్ధాలను తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రపంచంలో శాంతి నెలకొనాలని ఆకాంక్షించారు.