పవన్ సినిమా పోస్టర్‌పై పూనమ్ కౌర్ మండిపాటు
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ పోస్టర్‌పై నటి పూనమ్ కౌర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భగత్‌సింగ్ పేరును పవన్ పాదాల కింద ఉంచడంపై ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. స్వాతంత్ర్య సమరయోధులను మీరు గౌరవించకపోతే ఏమి కాదు కానీ.. కనీసం వారిని మాత్రం అవమానించకండి. తాజాగా ఇటీవల విడుదలైన సినిమా పోస్టర్‌లో భగత్‌సింగ్ పేరును పాదాల కింద ఉంచారు.. దీంతో ఆమె పోస్టర్ అభ్యంతకరంగా ఉందంటూ.. ఇది అహంకారమా? అజ్ఞానమా? అని ప్రశ్నించారు. దీన్ని వెంటనే భగత్ సింగ్ యూనియన్‌కు రిపోర్ట్ చేయండని పేర్కొన్నారు. పూనమ్ చేసిన ట్వీట్‌పై కొందరు మద్దతుగా కామెంట్లు చేస్తే.. పవన్ అభిమానులు మాత్రం ఆమెపై ఫైర్ అవుతున్నారు.

