కళ్లు చెదిరే ధరకు ‘పొన్నియన్ సెల్వన్’ ఓటీటీ రైట్స్
విలక్షణ దర్శకుడు మణిరత్నం పాన్ ఇండియా స్థాయిలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఎపిక్ పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘పొన్నియన్ సెల్వన్’ ఒక కొత్త రికార్డు సృష్టించింది. ఈ చిత్రం ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు భారీ ధరకు దక్కించుకున్నట్లు సమాచారం. ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. అమెజాన్ ప్రైమ్ ఈ రెండు భాగాలను 125 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. డిజిటల్ రైట్స్‌ను సన్ టీవీ నెట్ వర్క్ దక్కించుకుంది. ఈ చిత్రం పార్ట్-1 సెప్టెంబరు 30న విడుదల కాబోతోంది.

ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో ఐశ్వర్యరాయ్, విక్రమ్, కార్తి, జయం రవి, త్రిష, శోభిత ధూళిపాళ తదితరులు నటించారు. ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చోళుల కాలం నాటి స్వర్ణయుగాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ఈ మూవీ దర్శకుడు మణిరత్నం కలల చిత్రం. కల్కి కృష్ణమూర్తి రచించిన పొన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇటీవల ఆడియో ఫంక్షన్‌లో కమల్ హాసన్, రజనీకాంత్‌లు కూడా స్టేజ్‌పై సందడి చేశారు. ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల లో భారీ అంచనాలను పెంచుతోంది.