Breaking Newshome page sliderHome Page SliderNewsNews AlertTelangana

జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి పై క్లారిటీ ఇచ్చిన పొన్నం..

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికపై తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఉపఎన్నికలో స్థానిక నేతకే టికెట్ ఇచ్చేలా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిందని ఆయన స్పష్టంగా తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి టికెట్ ఇవ్వబోమని చెప్పారు. అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే అభ్యర్థిని ఖరారు చేస్తామని వివరించారు. ఈ ఉపఎన్నిక మాగంటి గోపినాథ్ మరణంతో ఏర్పడింది. బీఆర్ఎస్ పార్టీ ఈ సీటును తిరిగి గెలుచుకోవాలనే లక్ష్యంతో మాగంటి గోపినాథ్ భార్యను అభ్యర్థిగా నిలబెట్టే అంశాన్ని పరిగణలోకి తీసుకుంటోంది. మరోవైపు, కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. గతంలో కంటోన్మెంట్ ఉపఎన్నికలో విజయం సాధించిన శ్రీ గణేష్ ఘన విజయం తర్వాత, హైదరాబాద్ నగరంలో మరొక ఎమ్మెల్యే స్థానం గెలుచుకునే అవకాశంగా ఈ ఉపఎన్నికను చూస్తోంది. కాంగ్రెస్ పార్టీలో ఫిరోజ్ ఖాన్, అజహరుద్దీన్, నవీన్ యాదవ్, గద్దర్ కుమార్తె వెన్నెల పేర్లు టికెట్ కోసం చర్చలో ఉన్నాయి. తుది అభ్యర్థిని ఎవరిగా ప్రకటిస్తారో అనే ఉత్కంఠతో అన్ని పార్టీలు వేచి చూస్తున్నాయి.