Home Page SliderTelangana

పాలేరులో పొంగులేటి ఘన విజయం

తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఆరంభం నుంచే జోరు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ పాలేరులో భారీ మెజార్టీతో గెలుపొందారు.కాగా ఆయన బీఆర్ఎస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డిపై ఏకంగా 52 వేలకు పైగా మెజార్టీతో విజయ ఢంకా మోగించారు. మరోవైపు హుజుర్ నగర్‌లో ఉత్తమ్ కుమార్ రెడ్డి,మధిరలో భట్టి విక్రమార్క,కొడంగల్‌లో రేవంత్ రెడ్డి ఘన విజయం సాధించారు. దీంతో దేశ వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలు,కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు.