Home Page SliderNational

ఢిల్లీలో కోరలు చాచిన కాలుష్యం..దీపావళి ఎఫెక్ట్

ఢిల్లీలో ప్రతీ సంవత్సరం నవంబర్, డిసెంబర్ రోజులకు వాయు కాలుష్యం కోరలు చాస్తోంది. ఈ సంవత్సరం ఇంకా ముందుగానే గాలి నాణ్యత పడిపోతూ వచ్చి, దీపావళి నాటికి బాగా క్షీణించింది. ఈ నేపథ్యంలో దీపావళి టపాసులు, తయారీ, వినియోగంపై ప్రభుత్వం నిషేధం విధించింది. అయినా ప్రజలు ఖాతరు చేయకుండా పలుచోట్ల టపాసులు పేల్చారు. దీనివల్ల శబ్దకాలుష్యంతో పాటు గాలి నాణ్యత కూడా బాగా పడిపోయింది. శుక్రవారం తెల్లవారి దట్టమైన పొగ అలముకుని ఎదురు నుండి వచ్చే వాహనాలు కనిపించని పరిస్థితి నెలకొంది. ఢిల్లీలోని ఆనంద్ విహార్, బురారీ, ఆర్కేపురం, అశోక్ విహార్, మందిర్ మార్గ్, ఎయిర్ పోర్టు, జహంగీర్‌పుర్‌తో పాటు నోయిడా, గాజీయాబాద్, గురుగ్రామ్ వంటి ప్రదేశాలలో కూడా కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకుంది.