Andhra PradeshHome Page Slider

గెస్ట్‌హౌస్‌లో యువతితో పోలీస్.. స్పాట్‌లో పట్టిచ్చిన భార్య

గుంటూరు: మరో మహిళతో సహజీవనం చేస్తున్న భర్తను భార్య పోలీసులకు పట్టిచ్చింది. ఈ ఘటన గుంటూరులో చోటుచేసుకుంది. నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో కత్తి శ్రీను అనే వ్యక్తి పోలీస్‌గా పనిచేస్తున్నాడు. ఓ యువతితో అతడికి వివాహేతర సంబంధం ఉంది. దీంతో పోలీస్‌పై ఆయన భార్య పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది, అయినా చర్యలేమీ తీసుకోని పోలీసు డిపార్ట్‌మెంట్. ఈ క్రమంలో గెస్ట్ హౌస్‌లో యువతితో ఉండగా భర్తను పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టిచ్చిన వైనం. దీంతో కానిస్టేబుల్ శ్రీనును పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.