సమగ్ర సర్వే విషయంలో పోలీసుల హెచ్చరిక
తెలంగాణ రాష్ట్రప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే, కులగణన విషయంలో పోలీసులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఈ సర్వేపై సైబర్ నేరస్థుల కన్నుపడింది. సర్వేలో భాగంగా వివరాలు ఆన్‌లైన్‌లో చెప్పాలంటూ ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తారని పోలీసులకు సమాచారం అందింది. అందుకే ఎవరూ కూడా ఫోన్‌లో ఎలాంటి వివరాలు చెప్పకూడదని, సర్వే అధికారులు ఇళ్లకు వచ్చినప్పుడు మాత్రమే సమాచారం ఇవ్వాలని హెచ్చరించారు. సర్వే సిబ్బంది ఎలాంటి ధ్రువీకరణ పత్రాలను తీసుకోరని పేర్కొన్నారు. ఆధార్ అనుసంధానం కానీ, ఫోటోలు తీసుకోవడం కానీ చేయరని, ఎవరైనా అలా చేస్తే సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు. ఎలాంటి అనుమానాస్పద లింకులపై క్లిక్ చేసినా, మోసపోయినట్లు అనిపించినా 1930 టోల్ ఫ్రీ నెంబరుకు ఫిర్యాదు చేయాలన్నారు.

