అఘోరీ జైలు విషయంలో పోలీసుల టెన్షన్..
చీటింగ్ కేసులో అఘోరీ శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే చేవెళ్ల కోర్టులో ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించగా, అతనిని సంగారెడ్డి జైలుకు తరలించారు. జైలులో ఏ సెల్‌లో ఉంచాలనే విషయంలో పోలీసులకు టెన్షన్ పట్టుకుంది. ఆడా, మగా తేలకుండా అతడిని ఏ బ్యారెక్‌లోనూ ఉంచలేమని జైలు అధికారులు చెప్పడంతో న్యాయమూర్తి ఆదేశాల ప్రకారం లింగ నిర్థారణ పరీక్షలు చేయనున్నారు. అనంతరం చంచల్ గూడా జైలుకు తరలించవచ్చు. ఒక మహిళను రూ. 10 లక్షలకు మోసం చేసిన కేసులో అతడిని అరెస్టు చేస్తూ, అతని భార్యగా ఇటీవల సోషల్ మీడియాలో హడావుడి చేసిన వర్షిణిని కూడా నగరానికి తీసుకువచ్చారు. వారిని ఇబ్బంది పెడితే ఆత్మహత్య చేసుకుంటామంటూ వర్షిణి ఇటీవల సెల్ఫీ వీడియో కూడా రిలీజ్ చేసింది.

