వైసీపీ ఎమ్మెల్సీకి పోలీసుల షాక్
వైసీపీ ఎమ్మెల్సీకి షాకిచ్చింది. లీజు ముగిసిన మైన్ లో అధికార పార్టీ నాయకులు ఆక్రమంగా తవ్వకాలు చేస్తున్నారని ప్రశ్నించడంతో పోలీసులు నోటీసులు అందించారు. గూడూరు రూరల్ పరిధిలో లీజు ముగిసిన ఓ ప్రైవేట్ సంస్ధ శ్రీనివాస మైన్ లో కోట్ల రూపాయల క్వార్జ్ అక్రమార్గాన దోచేస్తున్నారని వైకాపా కు చెందిన ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ ఆరోపించారు. మైన్ సందర్శనకు తన అనుచరులు ,కార్యకర్తలతో బయలుదేరారు. విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు ఎక్కడ ఉద్రిక్తతలకు దారితీస్తాయనే కారణంతో పోలీసులు అడ్డుకున్నారు. మైన్ సందర్శించాలంటే ప్రభుత్వ లేదా సంబంధిత ఏడీ అనుమతి ఉండాలని ఎమ్మెల్సీకి పోలీసులు తెలిపారు. ఎమ్మెల్సీపై సెక్షన్ 168 కింద కేసు నమోదు చేసి నోటిసులు అందించారు గూడూరు రూరల్ ఎస్తై మనోజ్ కుమార్. అనంతరం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీయండంతో శాంతింప చేస్తున్నారు.
గూడూరు గాంధీనగర్ టిడ్కో ఇళ్ల సమీపంలో ఉన్న డంపింగ్ యార్డులో దాచిపెట్టిన మైనింగ్ పేలుడుకు ఉపయోగించే భారీ యంత్రాలు,పేలుడు పదార్థాలు,పేలుడు పదార్ధాలుకు రంద్రాలు చేసే యంత్రాలు,టిప్పర్ లు పేలుడు యంత్రాలు స్ధానిక సోషల్ మీడియాలో వైరల్ గా మారడం విశేషం. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో ఈ మైనింగ్ దందా నడుస్తుందని స్ధానిక గ్రామాల ప్రజలు వాపోతున్నారు.