బీఆర్‌ఎస్‌కు పోలీసుల షాక్
తెలంగాణలోని నల్గొండలో రైతు మహా ధర్నా నిర్వహించాలని బీఆర్‌ఎస్ పార్టీ చేసిన ప్రణాళికకు పోలీసులు భారీ షాక్ ఇచ్చారు. ఈ ధర్నాకు అనుమతి లేదంటూ నిరాకరించారు. దీనితో బీఆర్‌ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై అనుమతి కోసం హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ఎన్నికల హామీలను ఇంతవరకూ అమలు చేయలేదని, హామీలపై ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నల్గొండలో క్లాక్ టవర్ వద్ద రైతు మహాధర్నా తలపెట్టారు. ఈ ధర్నాకు బీఆర్‌ఎస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కాబోతున్నారు. దీనితో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు జిల్లా నేతలు. కానీ ఈ ధర్నా కారణంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుందని, సంక్రాంతి తర్వాత హైదరాబాద్ వచ్చే వాహనదారులకు ఇబ్బందులు కలుగుతాయని పోలీసులు అనుమతి నిరాకరించారు.

