షర్మిలా పర్యటనపై పోలీసు ఆంక్షలు
ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా పర్యటన పై ఏపీ పోలీసులు ఆంక్షలు విధించారు. కృష్ణాజిల్లా గన్నవరంలోని ఉద్దండరాయుని పాలెంలో షర్మిలా బుధవారం పర్యటించనున్నారు. 2015లో ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శించనున్న ఆమె పర్యటన నేపథ్యంలో కేసరపల్లి ఎస్.ఎల్.వి నివాసం వద్ద పోలీసులు బారికేడ్లు, ప్రత్యేక బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.


 
							 
							