Home Page SliderTelangana

ఓ వ్యక్తిని నడి రోడ్డుపై చితకబాదిన పోలీసులు

మద్యం తాగి న్యూసెన్స్ చేస్తున్నాడని నడిరోడ్డుపై వ్యక్తిని పోలీసులు చితకబాదారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. బాన్సువాడ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం తాగి న్యూసెన్స్ చేస్తున్నాడని నడిరోడ్డుపై కానిస్టేబుల్ కిరణ్,హోంగార్డు గంగాధర్ వ్యక్తిని చితకబాదారు. నడిరోడ్డుపై విచక్షణా రహితంగా కొట్టడంతో జిల్లా ఎస్పీకి బాధితుడు ఫిర్యాదు చేశాడు. దీంతో ఎస్పీ రాజేష్ చంద్ర ఈ ఘటనపై సీరియస్ అయి కానిస్టేబుల్ కిరణ్, హోంగార్డు గంగాధర్‌ను సస్పెండ్ చేశారు.