Home Page SliderNational

ప్రముఖ నటిపై పోలీసు కేసు

ప్రముఖ నటి కస్తూరిపై పోలీసు కేసు నమోదైంది. తెలుగు, తమిళ ప్రజలను ఉద్దేశిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. ఆ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూ, క్షమాపణలు కోరింది కస్తూరి. అయినా శాంతించని కొందరు ఆమెపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే కస్తూరిపై చెన్నై ఎగ్మోర్ పోలీసులు 4 సెక్షన్ల కింద ఆమెపై కేసు నమోదు చేశారు. అలాగే బ్రహ్మాణుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని, అవమానితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే తాను తప్పుగా ఏం మాట్లడలేదని, తన మాటలను కొందరు కావాలనే వక్రీకరించారని నటి కస్తూరి చెప్పింది.