Home Page SliderNational

“మోదీ పాలనలో పేదల జేబులు ఖాళీగా..సంపన్నుల జేబులు నిండుగా”:కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ మరోసారి ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించింది. భారతదేశంలో సంపన్నులు,పేదల మధ్య అంతరం నిత్యం పెరుగుతోందని కాంగ్రెస్ తాజాగా ట్వీట్ చేసింది. ప్రధాని మోదీ హయాంలో దేశంలోని సంపన్నులు మరింత సంపన్నులుగా, పేదవారు మరింత పేదలుగా మారుతున్నారని కాంగ్రెస్ వెల్లడించింది. కాగా మోదీ పేదల జేబుల్లో నుంచి డబ్బులు కొల్లగొట్టి ధనవంతుల ఖజానా నింపుతున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. భారతదేశంలో ఇప్పటికీ దాదాపు 70 కోట్ల మంది నెలకు కేవలం రూ.5,930/- మాత్రమే సంపాదిస్తున్నారని తెలిపింది. అయితే 1.4 కోట్ల మంది మాత్రం నెలకు రూ.4,41,666/- చొప్పున  ఆర్జిస్తున్నారని కాంగ్రెస్ స్పష్టం చేసింది. దీనిని బట్టి చూస్తే ప్రధాని మోదీ పాలనలో ఎవరు ఎక్కువగా లాభ పడుతున్నారో అర్థమవుతుందని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.