ప్రధాని మోదీ తల్లి హీరాబెన్‌కు అస్వస్థత..
ప్రధాని నరేంద్రమోదీ మాతృమూర్తి హీరాబెన్ అనారోగ్యంతో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. మంగళవారం రాత్రి ఆమె అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను అహ్మదాబాద్‌లోని యూఎన్ మెహతా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. తల్లి అనారోగ్యం గురించి తెలుసుకున్న ప్రధాని అహ్మదాబాద్‌కు వెళ్ళనున్నారు. దీంతో నగరంలో అధికారులు భద్రాత కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు ఆసుపత్రికి చేరుకుని హీరాబెన్ ఆరోగ్య పరిస్థితి వైద్యులతో అడిగి తెలుసుకున్నారు. ఈ ఏడాది జూన్ 18న ఆమె వందేళ్లు పూర్తి చేసుకున్నారు. 100 వ పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ ఆశీర్వాదం తీసుకున్నారు. ఆమెతో అరగంటపాటు ముచ్చటించారు. ఇటీవలే హీరాబెన్ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

