పహల్గామ్ దాడి తర్వాత తొలిసారి జమ్మూకాశ్మీర్ పర్యటనలో ప్రధాని మోదీ
పహల్గామ్ దాడి తర్వాత తొలిసారి జమ్మూ కాశ్మీర్‌లో పర్యటించనున్నారు ప్రధాని మోదీ. “ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జూన్ మొదటి వారంలో జమ్మూలో పర్యటిస్తారు. కాశ్మీర్‌కు మొదటి వందే భారత్ రైలును ప్రారంభిస్తారు” అని బిజెపి సీనియర్ నాయకుడు రవీందర్ రైనా స్థానిక దినపత్రిక రైజింగ్ కాశ్మీర్‌కు తెలిపారు. జమ్మూ కాశ్మీర్ బిజెపి మాజీ అధ్యక్షుడు రైనా బిజెపి జాతీయ కార్యనిర్వాహక సభ్యుడు కూడా పనిచేస్తున్నారు. శ్రీనగర్‌ను జాతీయ రాజధానికి అనుసంధానించే వందే భారత్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం జమ్మూలోని కాట్రా నుండి ప్రారంభిస్తారు. ఈ వారాంతంలో శ్రీనగర్‌కు వందే భారత్ రైలును జెండా ఊపి ప్రారంభించే అవకాశం ఉంది. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతిగా భారత్ పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో దాడులు నిర్వహించింది. ప్రపంచవ్యాపంగా ఈ ఘటన అనంతరం ప్రతీ భారతీయుడు ప్రధాని మోదీని ఎంతో ప్రశంసించారు. ‘ఆపరేషన్ సిందూర్’ అనంతరం జమ్మూ కాశ్మీర్‌లో ప్రధాని మోదీ తొలిసారి పర్యటించనున్నారు.