మహారాష్ట్ర ఎన్నికలలో ప్రచారానికి ప్రధాని మోడీ సిద్ధం…
మహారాష్ట్రలో మరోసారి ‘మహాయుతి’ని అధికారంలోకి తెచ్చేందుకు BJP వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా PM మోడీ రంగంలోకి దిగనున్నారు. ఈ నెల 8 – 14 మధ్య ఆయన 11 ర్యాలీల్లో పాల్గొననున్నారు. ‘మహాయుతి’ చేపట్టిన సంక్షేమ పథకాలు ఓటర్లకు వివరించి ఓట్లు అభ్యర్థించనున్నారు. BJP, శివసేన (ఏక్నాథ్ షిండే వర్గం), అజిత్ పవార్ నేతృత్వంలోని NCP మహాయుతిగా ఏర్పడి, కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. NOV 20న MH ఎలక్షన్స్ జరుగుతాయి.