Home Page SliderInternational

ట్రంప్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

అమెరికా అధ్యక్ష ఎన్నికలలో గెలుపొందుతున్న ట్రంప్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా భారత ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. కంగ్రాట్స్ మై ఫ్రెండ్ అంటూ పోస్టు పెట్టారు. చారిత్రాత్మక విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు. భారత్-యూఎస్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి కలిసి పనిచేద్దాం  అంటూ పిలుపునిచ్చారు. ట్రంప్‌తో కలిసి ఉన్న ఫోటోలు జత చేశారు. ఇప్పటికే 277 ఎలక్ట్రోరల్ ఓట్లతో విజయానికి చేరువలో మేజిక్ ఫిగర్ సాధించారు ట్రంప్.