Home Page SliderNews AlertTelanganatelangana,

మా నాన్నకు ఉద్యోగం ఇప్పించండి ప్లీజ్..

‘మా నాన్నకు ఉద్యోగం ఇప్పించండి ప్లీజ్..’ అంటూ ఇద్దరు చిన్నారులు పలకపై రాసి బాధను వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. వరంగల్ జిల్లా ఖానాపురం మండలానికి చెందిన పాలకుర్తి మహేందర్ డీఎస్సీ 2024 ఫలితాలలో స్పెషల్ ఎడ్యుకేషన్ సెకండరీ గ్రేడ్ టీచర్‌ విభాగంలో 10 వ ర్యాంక్ సాధించాడు. ఇక ఉద్యోగం వచ్చినట్లేనని సంతోషపడ్డాడు. కానీ అది ఎక్కువ సేపు నిలవలేదు. అధికారుల నిర్లక్ష్యం, సాంకేతిక సమస్య కారణంగా ఉద్యోగం రావడం లేదంటూ కన్నీటి పర్యంతమవుతున్నాడు. తనకంటే ఎక్కువ ర్యాంకు వచ్చిన వారికి కూడా ఉద్యోగం వచ్చిందని, తనకు ఇవ్వటం లేదని విద్యాశాఖ అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. తనకు ఆర్‌సీఐ( రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌ను సరైన సమయంలో ఇవ్వలేదని సాంకేతిక సమస్య అంటున్నారని, మీడియా ముందు గోడు వెళ్లబోసుకున్నాడు. జిల్లా విద్యాశాఖాధికారి మాట్లాడుతూ ఆర్‌సీఐ సర్టిఫికెట్ సరైన సమయంలో రాలేదని, దానిని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్‌కు పంపించామని, కానీ వారు తిరస్కరించి తిరిగి పంపించారని, అందుకే ఉద్యోగం ఇవ్వలేకపోయామని చెప్తున్నారు.