ప్లీజ్ నాన్న చంపొద్దు…
అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకుందామనుకున్నాడు.తాను చనిపోతే తన కూతుళ్లు దిక్కులేని వారౌతారని కలత చెందాడు.దీంతో ముక్కుపచ్చలారని ఇద్దరి కూతుళ్లని బైక్ పై ఎక్కించుకుని నేరుగా కాలువలోకి దూకించేశాడు ఓ తండ్రి.పిల్లలు చనిపోయారు…కానీ తండ్రి మాత్రం అదృష్టవశాత్తు బతికాడు.ఈ విషాదకర ఘటన పల్నాడు జిల్లా ఈపూరు మండలం పనికుంట గ్రామంలో చోటు చేసుకుంది. ఓ దిన పత్రికలో విలేకరిగా పనిచేస్తున్న తురుమెళ్ల వెంకట నాగాంజనేయ శర్మ అలవిమాలిన అప్పులు చేశాడు.వారి నుంచి ఒత్తిళ్లు అధికమయ్యాయి.మరో వైపు మంచం పట్టిన భార్యకు మందులు కూడా కొనలేకపోతున్నాడు.ఈ తరుణంలో ఆత్మహత్య చేసుకుందామని ఫిక్స్ అయ్యాడు.అయితే కాలువలోకి బైక్‌ని దూకించగానే తొలుత చిన్న కుమార్తె కావ్య (7) స్పాట్ లోనే చనిపోగా…ఈత వచ్చిన నాగాంజనేయ శర్మ కాలు పట్టుకున్న పెద్ద కుమార్తె(10)….నాన్న చంపొద్దు…చంపొద్దు ప్లీజ్ అని బతిమాలినా వినిపించుకోకుండా కాలుని విదిలించేశాడు.దీంతో పెద్ద కుమార్తె కూడా చనిపోయింది.అయితే ఊపిరాడక పోవడంతో ప్రాణ భయంతో ఈత వచ్చిన శర్మ ఎట్టకేలకు ఒడ్డుకు చేరుకున్నాడు. ఈ స్టంట్ మొత్తాన్నిపాలవాహనం డ్రైవర్ దూరం నుంచి చూస్తున్నాడు.అప్పటికే పిల్లల ప్రాణాలు నీటిపాలయ్యాయి.వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని ఈత గాళ్ల సాయంతో పిల్లల మృతదేహాలను వెలికితీయించారు.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.