పాఠశాలపై కూలిన విమానం
స్కూలుపై విమానం కూప్పకూలిన ఘటనలో ఒకరు మృతి చెందారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని మైల్స్టోన్ స్కూల్ అండ్ కాలేజీ క్యాంపస్లో బంగ్లాదేశ్ ఎయిర్ఫోర్స్ శిక్షణ విమానం సోమవారం కుప్పకూలింది. దీంతో క్యాంపస్లో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఒకరు మృతి చెందగా.. పలువురు విద్యార్ధులు గాయపడ్డారు. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకుచ్చారు. కూలిన విమానం F-7 BGIగా బంగ్లా సైన్యం ధృవీకరించింది. ఇటీవల వరసగా విమాన ప్రమాదాలు సంభవించడంతో అటు ప్రయాణికులు ఇటు ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి.