యూట్యూబ్ చూసి తండ్రి హత్యకు ప్లాన్..
యూట్యూబ్‌లో వీడియోలు చూసి, తండ్రి హత్యకు ప్లాన్ చేశాడో దుర్మార్గుడు. ఎన్టీఆర్ జిల్లాలో ములకలపెం గ్రామానికి చెందిన కడియం శ్రీనివాసరావు కుమారుడు పుల్లారావు తండ్రినే హత్య చేశాడు. వ్యసనాలకు బానిసై, యూట్యూబ్‌లో ‘ఒకే దెబ్బతో హత్య చేయడం ఎలా?’ అనే వీడియో చూసి హత్య చేశాడు. పైగా తండ్రిని భూ తగాదాలలో ప్రత్యర్థులు హత్య చేశారంటూ డ్రామాలాడాడు. పేకాట, బెట్టింగ్‌లలో గతంలో పుల్లారావు చేసిన 4 లక్షల అప్పును తండ్రి తీర్చాడు. ఈ విషయంలో పలుమార్లు మందలించగా, కోపంతో సమయం చూసి ఈ నెల 8న పొలంలో ఉన్న తండ్రిని చూసి కర్రతో కొట్టి చంపేశాడు. తండ్రి మృతిపై అనుమానాలున్నాయని నాటకాలాడుతూ కేసు తనపై రాకుండా ఉండేందుకు గ్రామస్తులతో కలిపి నిరసనలు చేశాడు. చివరికి విచారణలో పుల్లారావే హంతకుడని తేలడంతో అతడిని అరెస్టు చేశారు.


 
							 
							