DOLO-650 కి ఫార్మా అసోసియేషన్ క్లీన్ చిట్
జ్వరం, ఒళ్లునొప్పుల నివారణకు వాడుకునే సాధారణ పారాసిట్మల్ DOLO 650 తయారీ సంస్థ మైక్రోల్యాబ్స్‌కు ఊరట లభించింది. ఈ మాత్రలను సిఫారసు చేసినందుకు వైద్యులకు మైక్రోల్యాబ్స్ 1000 కోట్ల రూపాయలు ప్రోత్సాహకాలు ఇచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి మనకు తెలిసిందే. అసలు డోలో విక్రయాలే అంత మొత్తంలో లేవని మైక్రోల్యాబ్స్ ఖండించింది. దీనిపై ఒక నివేదికను డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ (కేంద్ర రసాయనాల శాఖ) నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA)కు ఐపీఏ సమర్పించింది. మైక్రోల్యాబ్స్ అన్ని రకాల ఫార్మాస్యూటికల్ మార్కెటింగ్ విధానాల మార్గదర్శకాలను సక్రమంగానే అనుసరించిందని తన నివేదికలో పేర్కొంది. అనైతిక, తప్పుడు విధానాలు అనుసరించిందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని తేల్చి చెప్పింది. గత నెలలో మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్ సమాఖ్య సుప్రీంకోర్టులో మైక్రోల్యాబ్స్‌కు వ్యతిరేకంగా పిటిషన్ వేసింది. దీన్ని ఐపీఏ తన నివేదికలో పేర్కొంటూ ఒక ఏడాదిలో ఒక్కడోలో 650 బ్రాండ్‌పై ఉచితాల కోసం 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు చెప్పడం అసమంజసమని పేర్కొంది.