Home Page SliderNationalNews AlertPolitics

వక్ఫ్ బిల్లుపై సుప్రీంలో పిటిషన్

పార్లమెంట్‌లో ఆమోదం పొందిన వక్ఫ్ సవరణ బిల్లును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీ మహ్మద్ జావేద్ పిటిషన్ వేశారు. రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తోందంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ బిల్లును కాంగ్రెస్, ఇతర విపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. అయితే లోక్ సభ, రాజ్యసభలలో బిల్లు ఆమోదం పొందడంతో, ఇక రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకంతో చట్టంగా మారబోతోంది. ఈ బిల్లు మైనారిటీల ఆస్తుల పరిరక్షణకు, పారదర్శకత కోసమే అని ప్రభుత్వం పేర్కొంది. వారి హక్కులకు భంగం కలుగుతోందంటూ విపక్షాలు ఆరోపిస్తున్నారు.