పవన్ పోర్టు తనిఖీపై పేర్ని నాని సంచలన కామెంట్స్..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల కాకినాడ పోర్టును తనిఖీ చేసిన ఘటనపై వైసీపీ నేత పేర్ని నాని సంచలన కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ ఉద్దేశపూర్వకంగానే స్టెల్లా షిప్‌ను తనిఖీ చేసి, కెన్‌స్టార్ షిప్‌ను ఎందుకు వదిలేశారని పేర్కొన్నారు. ఎందుకంటే ప్రస్తుత ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌కి దానితో సంబంధం ఉందని ఆరోపించారు. మంత్రి వియ్యంకుడు అందులో బియ్యం తరలిస్తున్నట్లు తమ వద్ద సమాచారం ఉందన్నారు. ఆ షిప్‌లోకి వెళ్లడానికి పవన్‌కు అనుమతి లేదని పేర్కొన్నారని, అయితే ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్‌కు అనుమతి ఇవ్వలేదంటే, కెన్‌స్టార్ షిప్‌లోకి వెళ్లవద్దని చంద్రబాబు చెప్పారా? అని నిలదీశారు.