Andhra PradeshBreaking Newshome page sliderHome Page Slider

CM చంద్రబాబుపై పేర్ని నాని తీవ్ర విమర్శలు

ఆంధ్రప్రదేశ్‌కు వ్యవసాయ రాష్ట్రం, ధాన్యాగారం అనే బ్రాండ్‌ ఇమేజ్‌ను సీఎం చంద్రబాబు నాయుడు దెబ్బతీశారని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన, రైతుల పట్ల చంద్రబాబు చూపుతున్న వ్యవహారంపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు.

“రైతును గుడ్డికన్నుతో చూడటం చంద్రబాబు విధానం. ఆయన ఎప్పటికీ రైతు వ్యతిరేకే. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశారు,” అని పేర్ని నాని అన్నారు.18 నెలల్లోనే రూ.2.66 లక్షల కోట్ల అప్పులు చేసినప్పటికీ వాటిని ఎక్కడ వినియోగించారో ప్రభుత్వం చెప్పలేకపోతోందని నాని విమర్శించారు. “దేశ GDPలో ఆంధ్రప్రదేశ్ వాటా ఎంత? ఈ అప్పులు తెచ్చి ఎక్కడ పెట్టారు?” అంటూ ఆయన ప్రశ్నించారు.