‘తిరుపతి ప్రజలు అప్రమత్తంగా ఉండండి’..హోంమంత్రి
తిరుపతిలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హోం మంత్రి అనిత సూచించారు. తిరుపతి జిల్లాలోని తిరుమలలో భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడే ప్రమాదం ఉందని, మాల్వాడి గుండం ఉద్ధృతంగా ప్రవహిస్తోందని పేర్కొన్నారు. జిల్లాలోని కాళంగి, ఇతర ప్రాజెక్టుల గేట్లు ఎత్తే నేపథ్యంలో పరివాహక ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని పేర్కొన్నారు. తిరుపతి పట్టణంలోని వరదనీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోందని, అక్కడ లక్ష్మీపురం కూడలి, గొల్లవానిగుంట వంటి లోతట్టు ప్రాంతాలలో ముందస్తు రక్షణ చర్యల కోసం అధికారులను అప్రమత్తం చేశారు.

