Andhra PradeshHome Page Slider

బ్యాంక్ అకౌంట్‌లోనే పింఛన్లు, వారికి మాత్రమే ఇళ్ల వద్దే పంపిణీ

Share with

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పింఛన్లు వాలంటీర్ల ద్వారా ఇవ్వొద్దంటూ ఆంక్షలు విధించిన ఈసీ ఈసారి, నేరుగా వారికి పింఛన్లు అందించాలంటూ సీఎస్‌ను ఆదేశించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ లబ్ధిదారులకు చెల్లింపులపై కీలక నిర్ణయం తీసుకుంది. మే 1 నుంచి 5వ తారీఖులోగా పింఛన్లను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం ఆదార్ ద్వారా బ్యాంక్ అనుసంధానమైన సుమారు 75 శాతం మందికి నేరుగా బ్యాంక్ అకౌంట్లో పింఛన్ మొత్తాన్ని జమ చేస్తారు. మొత్తంగా వారి వారి అకౌంట్లలో పింఛన్ మొత్తం చేరుతుంది. ఇక దివ్యాంగులు, వ్యాధులతో బాధపడుతున్నవారికి మాత్రం పింఛన్ నేరుగా అధికారులు ఇళ్లకు వెళ్లి అందిస్తారు. అదే సమయంలో బ్యాంక్ అకౌంట్లు లేని 25 శాతం మంది లబ్దిదారులకు పింఛన్ మొత్తాన్ని ఇళ్ల వద్ద నగదు రూపంలో చెల్లిస్తారు. ఇందుకు సబంధించి కలెక్టర్లకు ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ ఆదేశాలు జారీ చేశారు. అంతకు ముందు ఇళ్ల వద్దే పింఛన్ పంపిణీ చేయాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని కూటమి నేతలు డిమాండ్ చేశారు. సీఎస్ చాంబర్ ముందు ధర్నా సైతం నిర్వహించారు.