Home Page SliderTelangana

30న జరిగే మెగా లోక్ అదాలత్‌లో పెండింగ్‌ కేసులు పరిష్కరిస్తాం

మంచిర్యాల: ఈ నెల 30న నిర్వహించనున్న మెగా లోక్ అదాలత్‌లో జిల్లాలో పెండింగ్‌లో ఉన్న కేసులు సాధ్యమైనంత వరకు ఎక్కువ సంఖ్యలో పరిష్కరించేందుకు కృషి చేయాలని జిల్లా జడ్జి బోయ శ్రీనివాస్ అన్నారు. శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలో పోలీస్, ఎక్సైజ్, బ్యాంకు, ఇన్సూరెన్స్ అధికారులతో పాటు న్యాయవాదులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏళ్ల తరబడి కోర్టు చుట్టూ తిరుగుతున్న కక్షిదారులు లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సంబంధిత అధికారులు, పోలీసులు కక్షిదారులను సంప్రదించి రాజీ కుదిర్చే విధంగా అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి అర్పిత మారంరెడ్డి, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.