హెల్మెట్ లేకపోతే మాడు పగిలే జరిమానా
హైదరాబాద్ నగరంలో ఇకపై ట్రాఫిక్ నిబంధనలు మరింత కఠినం కానున్నాయి. సిటీ పరిధిలో మూడు నెలల వ్యవధిలో మూడుసార్లు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘీంస్తే జేబుకు చిల్లు పడ్డట్లే. గతంలో సాధారణంగా హెల్మెట్ లేకపోతే రూ.100 జరిమానా విధిస్తారు. ప్రస్తుతం 3 నెలల వ్యవధిలో 3 సార్లు పట్టుపడితే మొదటిసారి రూ. 100 రెండోసారి రూ. 200 మూడోసారి రూ.500 జరిమానా విధిస్తారు.

ప్రమాదాలు తగ్గించాలని…
ఏటా రోడ్డు ప్రమాదాల వల్ల 290 మంది చనిపోతున్నారు. ఈ సంఖ్యను కనీసం 100కు తగ్గించాలని పోలీసులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ విషయంలో ట్రాఫిక్ పోలీసులు ఎంత కఠినంగా ఉన్నా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన కేసులు మాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు జరిమానా విషయంలో మరింత కఠినంగా ఉండలనే నిర్ణయానికి వచ్చారు.