UAE నుండి బంగారం దిగుమతులకు రూపాయల్లో చెల్లింపు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) నుండి బంగారం, ఇతర వస్తువుల దిగుమతికి ఇండియా రూపాయిల్లో చెల్లించనుంది. భారతదేశం నుండి రత్నాలు, ఆభరణాల కొనుగోళ్లకు యుఎఇ కూడా రూపాయిలను ఉపయోగిస్తోందని భారత ప్రభుత్వ సీనియర్ అధికారి తెలిపారు. జులై 2022లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దిగుమతిదారులు… రూపాయల్లో చెల్లింపులు చేయడానికి, ఎగుమతిదారులు స్థానిక కరెన్సీలో చెల్లింపులను స్వీకరించడానికి అనుమతించాలని నిర్ణయించాయి. జూలై 2023లో, రెండు దేశాలు తమ స్థానిక కరెన్సీలను ద్వైపాక్షిక లావాదేవీలను సెటిల్ చేసుకోవడానికి ఉపయోగించుకునేందుకు అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. ప్రమేయం ఉన్న దేశాలు RBI అనుమతించిన ప్రత్యేక రూపాయి వోస్ట్రో ఖాతాను ఉపయోగిస్తున్నాయి. రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను పెంపొందించడానికి ఇది మరింత దోహదకారి అవుతుందని తెలుస్తోంది. డిసెంబర్ 2023లో, యుఎఇ నుండి కొనుగోలు చేసిన ముడి చమురు కోసం భారతదేశం మొట్టమొదటిసారిగా రూపాయలలో చెల్లింపు చేసింది.
