News AlertTelangana

పవన్ వాయిస్ చట్టసభలో వినిపించాల్సిందే

పవన్ కళ్యాణ్ ఒక వీరుడని సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ చట్టసభల్లో అడుగుపెట్టాలని తాను మనస్పూర్తిగా కోరుకుంటునానన్నారు. సమాజాన్నే మార్చాలనేది పవన్ ఆశయం అని, ఏదో ఒక పార్టీలో చేరడం, ఎలాగైనా పార్లమెంటుకో, అసెంబ్లీకో వెళ్లడం ఆయన అభిమతం కాదన్నారు. తనతో ఎవరు ఉన్నా, లేకపోయినా పోరాడేవాడే వీరుడని, పవన్ కూడా అలాంటి వీరుడేనని గోపాలకృష్ణ అన్నారు. ఎన్నికల్లో నిలబడి గెలుస్తాం, సీఎం అయిపోదామని పవన్ కోరిక కాదని స్పష్టం చేశారు. పవన్ తన వాయిస్‌ను చట్టసభల ద్వారా వినిపించాలని కోరుకుంటున్నానని అన్నారు. పవన్ మనసు తనకు తెలుసని, ప్రపంచం గురించి పవన్‌కు చాలా బాగా తెలుసని చెప్పారు. వచ్చే ఎన్నికలలో పవన్ గెలుపొంది, శాసనసభలో అడుగుపెట్టాలని ఆకాంక్షించారు.