Andhra PradeshHome Page SliderNews AlertPoliticsTrending Today

సినిమా థియేటర్‌లో పవన్ వినూత్న కార్యక్రమం..

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యల పరిష్కారానికి కొత్త మార్గం ఎంచుకున్నారు. మనఊరు-మాటామంతీ కార్యక్రమాన్ని వినూత్నంగా ప్రయత్నించి, సినిమా థియేటర్‌లోని స్క్రీన్‌పై ప్రత్యక్షమయ్యారు. అక్కడ నుండి ఆన్‌లైన్ ద్వారా గ్రామస్థులతో మంగళగిరి క్యాంప్ కార్యాలయం నుండి శ్రీకాకుళం జిల్లా రావివలస గ్రామస్థులతో మాట్లాడారు. పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పనులపై వివరాలను, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికై సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.