‘బ్రో’ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో అలరించిన పవన్ ‘మాస్ డ్యాన్స్’
‘బ్రో’ చిత్ర ప్రీరిలీజ్ ఫంక్షన్‌లో బ్రో చిత్రబృందం అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఈ చిత్రంలో ఉన్న పవన్ కళ్యాణ్ మాస్ డ్యాన్స్ సాంగ్ వీడియోను ప్రదర్శించింది. దీనితో అభిమానులు చాలా కుషీ అవుతున్నారు. పవన్ తమ్ముడు చిత్రంలో చేసిన ‘నబో నబో నబ్బరి గాజులు’ అనే పాటను రీక్రియేట్ చేసి, పవన్, సాయిధరమ్ తేజ్. చిత్ర సంగీత దర్శకుడు తమన్ కలిసి డ్యాన్స్ చేసిన వీడియోను షేర్ చేశారు. దీనిలో పవన్ తమ్ముడు చిత్రంలోని ‘ఓ పిల్లా నీ పేరు లవ్‌లీ’ అనే పాటలో ఉన్న లుక్‌లో కనిపిస్తారు. చాలా రోజుల తర్వాత పవన్‌ను ఇలా చూస్తున్నామంటూ ప్రేక్షకులు సంబర పడుతున్నారు. ఈ చిత్రం తమిళ చిత్రం ‘వినోదాయ సిత్తం’ అనే చిత్రానికి రీమేక్‌గా నిర్మించారు. దీనికి సముద్రఖని దర్శకత్వం వహిచగా, కేతికా శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా నటించారు. పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో కాలదేవునిగా కనిపిస్తారు. సాయి ధరమ్ తేజ్ మార్కండేయునిగా కనిపిస్తారు. ఇది జూలై 28న రిలీజ్ కాబోతోంది.

