ఇన్‌ఫ్లుయెన్సర్ అరెస్టుపై సీఎంకి పవన్ కళ్యాణ్ కౌంటర్..
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, న్యాయ విద్యార్థిని శర్మిష్ట పనోలీని కోల్‌కతా పోలీసులు అరెస్టు చేయడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కోల్‌కతా ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ప్రశ్నలు సంధించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో స్పందించని బాలీవుడ్ నటులను ఉద్దేశించి శర్మిష్ట సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేసింది. అయితే దానిపై వ్యతిరేకత రావడంతో వెంటనే తొలగించి, క్షమాపణలు చెప్పింది. అయితే ఆమెను పోలీసులు అరెస్టు చేసి, కేసు పెట్టారు. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దీనితో పవన్ మండిపడ్డారు. సనాతన ధర్మాన్ని అపహాస్యం చేసే నాయకులు, టీఎంసీ ఎంపీలపై మాత్రం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. లౌకికవాదం పేరుతో కొన్ని మతాలకు ప్రభుత్వం అండగా ఉంటోందని విమర్శించారు. సనాతన ధర్మాన్ని కూడా కాపాడాలని, పోలీసుల వైఖరి అందరిపైనా ఒకేలా ఉండాలని పేర్కొన్నారు.

