ప్రధానితో పవన్ కళ్యాణ్ భేటీ
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. దాదాపు అరగంట సేపు వీరి సమావేశం కొనసాగింది. ఈ సందర్భంగా పలువురు కేంద్రమంత్రులతో కూడా పవన్ భేటీ అయ్యారు. జలమిషన్ అమలులో రాష్ట్రానికి రావలసిన నిధుల గురించి చర్చించినట్లు తెలిపారు. కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌తో కూడా భేటీ అయ్యారు. ఏపీలో ఎర్రచందనం అక్రమ రవాణాపై చర్చించినట్లు సమాచారం. నోడల్ ఏజెన్సీ ఏర్పాటు చేయాలని పవన్ కోరారు.
BREAKING NEWS: పుష్ప 2తో పోటీ పడుతున్న హీరో సిద్ధార్థ్..

