Andhra PradeshHome Page Slider

“పవన్ కళ్యాణ్‌ రాజకీయాలకు పనికిరాడు”: అంబటి

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ఏపీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ మంత్రి అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్‌పై విమర్శలతో విరుచుకుపడ్డారు. ఆయన మాట్లాడుతూ..వారాహి యాత్రలో పవన్ విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని ఆరోపించారు.  పవన్ కళ్యాణ్‌కు ఆవేశంతో ఊగిపోవడం అలవాటేనన్నారు. కాగా పవన్ మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్‌తో బాధపడుతున్నారని అంబటి విమర్శించారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరారని ఆయన గాలి కళ్యాణ్ అని అంబటి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో టీడీపీపై కాపుల కోపాన్ని తగ్గించడానికే వారాహి యాత్ర అని ఆయన ఎద్దేవా చేశారు. ఏపీలో పవన్ ఎంత ప్రయత్నించినా అసెంబ్లీకి వెళ్లలేరు..అలానే చంద్రబాబును సీఎం చేయలేరని మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.