Home Page SliderNationalNews AlertSpiritualTrending Today

దక్షిణ దేశ తీర్థయాత్రలలో బిజీగా పవన్ కళ్యాణ్

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సనాతనధర్మ పరిరక్షణ ఉద్యమంలో భాగంగా దక్షిణ భారత దేశ యాత్రలు సంకల్పించారు. ఈ పర్యటనలో ఆయన కేరళ, తమిళనాడు రాష్ట్రాలలోని పలు ఆలయాలను సందర్శించారు. బుధవారం కొచ్చి సమీపంలోని అగస్త్య మహర్షి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే నేటి సాయంత్రం తిరువనంతపురంలోని పరశురామస్వామి ఆలయాన్ని కూడా సందర్శించనున్నారు. మూడు రోజుల పాటు పవన్ పర్యటిస్తారని, ఈ యాత్రలో అనంత పద్మనాభస్వామి ఆలయం, మధుర మీనాక్షి ఆలయం, అగస్త్య జీవ సమాధి, కుంభేశ్వర, స్వామి మలైయ్, తిరుత్తణి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలను వెళ్లనున్నారని పవన్ టీమ్ తెలియజేశారు. ఆయన వెంట పవన్ కుమారుడు అకీరానందన్, టీటీడీ బోర్టు సభ్యుడు ఉన్నారు.