చిరంజీవికి పవన్ కళ్యాణ్ ఎమోషనల్ బర్త్ డే విషెస్..
మెగాస్టార్ చిరంజీవి 1955 ఆగస్టు 22న పశ్చిమ గోదావరి జిల్లా మొగుల్తూరు గ్రామంలో కొణిదెల వెంకటరావు, అంజనాదేవి దంపతులకు జన్మించారు. నాగేంద్ర బాబు, పవన్ కళ్యాణ్ తమ్ముళ్లు. 25 ఏళ్ల వయసులో, అంటే 1980లో ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖను వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు. ఇద్దరు కూతుళ్లు సుస్మిత, శ్రీజ, కొడుకు రామ్ చరణ్. మెగాస్టార్ చిరంజీవి ఎవరి సపోర్ట్ లేకుండానే సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. ఆయన డాన్స్, నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. అంచెలంచెలుగా ఎదిగి స్టార్ హీరో అయ్యారు. టాలీవుడ్ బాక్సాఫీస్ కు కొత్త లెక్కలు నేర్పంచిన మొదటి హీరో మెగాస్టార్ చిరంజివి. నాట్యరంగంలో ఎంతో మందికి స్ఫూర్తినిచ్చిన ఆచార్య. నటనకు “గాడ్ ఫాదర్”. ప్రతి పనిని “సవాల్”గా తీసుకుని “విజేత”గా వెలుగొందుతున్న “హీరో”. కరోనా సమయంలో ఎంతో మంది పేద కళాకారులకు అండగా నిలిచారు. రక్తదానం, నేత్రదానం చేసి ఎంతో మంది ప్రాణాలను కాపాడి ‘అందరివాడు’ అనిపించుకున్న వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి.

ఈ రోజు ఆయన 67 వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజివికి ట్విటర్ ద్వారా బర్త్ డే విషెస్ తెలిపారు. “నా ప్రియమైన సొదరుడికి నా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు, నేను ప్రేమించే, గౌరవించే, ఆరాధించే మీకు ఈ ప్రత్యేకమైన రోజు మంచి ఆరోగ్యం, విజయం, కీర్తి లభించాలని కోరుకుంటున్నానంటూ ట్వీట్ చేశారు.
“గ్రామీణ భారతదేశం కోసం పనిచేస్తున్న ఒక మేధావికి పుట్టినరోజు సందేశాన్ని ఫార్వర్డ్ చేస్తున్నాను. చిరంజీవి అంటే నాకు ఎమోషన్. ఆయన తీసిన ‘రుద్రవీణ’ సినిమా నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ చిత్రం నన్ను భారతదేశంలోని గ్రామాల గురించి తెలుసుకునేలా, వారి కోసం పని చేసేలా చేసింది. దయచేసి చిరంజీవి గారికి హృదయ పూర్వక బర్త్ డే శుభాకాంక్షలు తెలియజేయండి..’ అంటూ పవన్ కళ్యాణ్ మరో ట్వీట్ చేశారు.

