వరుణ్ తేజ్,లావణ్య ఎంగేజ్‌మెంట్‌లో పవర్‌స్టార్ సందడి
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్,హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఎంగేజ్‌మెంట్ నిన్న నాగబాబు ఇంట్లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఎంగేజ్‌మెంట్‌కు మెగా ఫ్యామిలీ,అల్లు ఫ్యామిలీతోపాటు మరికొంతమంది సన్నిహితులు హాజరయ్యారు. అయితే ఈ వేడుకలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కూడా పాల్గొని వరుణ్ తేజ్,లావణ్య త్రిపాఠికి శుభాకాంక్షలు తెలిపారు. కాగా పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ “వరుణ్‌లవ్” జంటను ఆశీర్వదించిన ఫోటోలు తాజాగా బయటకు వచ్చాయి. వీటిలో పవన్ కళ్యాణ్ లావణ్యకు బుకే అందజేసి..శుభాకాంక్షలు తెలియజేశారు. వరుణ్ తేజ్‌తో కాసేపు ముచ్చటించారు. అనంతరం కొత్త జంటతోపాటు అన్నయ్య నాగబాబు దంపతులతో కలిసి ఫోటో దిగారు. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా బాగా వైరల్ అవుతున్నాయి.