Andhra PradeshBreaking NewsHome Page Slider

హిందూ ధర్మంపై మాట్లాడే హక్కు పవన్ కి లేదు

హిందూ ధర్మం, ఆలయాల పరిరక్షణపై మాట్లాడే హక్కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు లేదని మాజీ సీఎం జగన్ అన్నారు. కాశీనాయన క్షేత్రాన్ని కూల్చేస్తుంటే పవన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఎక్స్ లో మండిపడ్డారు. ‘ఆలయాల పట్ల త‌మ‌కున్న‌ చిత్తశుద్ధి కూటమి సర్కార్ కు లేదని విమ‌ర్శించారు.కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కాశీనాయన క్షేత్రాన్ని కూలుస్తోందని మండిప‌డ్డారు. ఆ ఆలయ అభివృద్ధికి వైసీపీ సర్కార్ ఎంతో కృషి చేసిందని జ‌గ‌న్ గుర్తు చేశారు.తాము అధికారంలోకి రాగానే కాశీ నాయ‌న క్షేత్రాన్ని పునః నిర్మిస్తామ‌ని జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు.