“పవన్ చంద్రబాబు పట్టిన చంద్రముఖిలా ప్రవర్తిస్తున్నారు”: మంత్రి రోజా
పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వైసీపీ మంత్రులు,నేతలు తీవ్రస్థాయిలో ఖండిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే వైసీపీ నాయకులు దీనిపై స్పందించి పవన్ కళ్యాణ్‌కు చురకలు వేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మంత్రి రోజా కూడా దీనిపై స్పందించారు. రోజా మాట్లాడుతూ..పవన్ కళ్యాణ్ చంద్రబాబు పట్టిన చంద్రముఖిలా పిచ్చి గంతులేస్తున్నారని విమర్శించారు. పవన్ సంస్కారం గురించి మాట్లాడుతుంటే..సన్నిలియోన్ వేదాలు వల్లించినట్లుందని రోజా ఎద్దేవా చేశారు. అంతేకాకుండా పవన్ ఎవరి మాట వినడు కాబట్టే భార్యలంతా వదిలేశారని రోజా ఆరోపించారు. బ్యాంకులు ,మీసేవ కేంద్రాలు కూడా వివరాలు అడుగుతాయన్నారు. అయితే డేటా తీసుకొని అక్రమ రవాణా చేస్తున్నారని మోదీని అనగలరా అని రోజా ప్రశ్నించారు. కరోనా లాంటి కష్ట సమయాల్లో ప్రజలకు సేవలందించింది వాలంటీర్లేనని మంత్రి రోజా వెల్లడించారు.