Home Page SliderNational

పవిత్రగౌడ్ నా భర్తకు భార్య కాదు..హీరో దర్శన్ భార్య ఫైర్

పవిత్రగౌడ్‌ను తన భర్త పెళ్లి చేసుకోలేదని, హీరో దర్శన్ భార్య విజయలక్ష్మి అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసు రికార్డులలో, నేషనల్ మీడియాలలో తన భర్త దర్శన్‌కు పవిత్రగౌడను భార్యగా పేర్కొనడంపై ఆమె మండిపడ్డారు. అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో దర్శన్, పవిత్ర నిందితులుగా పోలీసు కస్టడీలో ఉన్నారు. ఈ విషయంపై బెంగళూరు పోలీసు కమిషనర్ బి.దయానంద్‌కు విజయలక్ష్మి లేఖ రాశారు. తమ పెళ్లి 2003లో జరిగిందని, ఆమెను దర్శన్ భార్యగా పేర్కొనడం వల్ల తనకు, తన కుమారునికి సమస్యలు వస్తాయని పేర్కొన్నారు. ఈ వాస్తవాలను పోలీసు రికార్డులలో స్పష్టంగా రాయాలని సూచించారు. ఈ కేసులో వీరిద్దరితో పాటు 15 మందిని పోలీసులు అరెస్టు చేశారు. పవిత్రగౌడ్‌పై అసభ్య సందేశాలు పంపించాడని అభిమాని రేణుకాస్వామిని దారుణంగా హింసించి, హత్య చేయడం సంచలనం రేపింది.