Home Page SliderNationalPolitics

మరాఠీలో మాట్లాడిన పవన్ కళ్యాణ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ఎన్నికలలో పవన్ సుడిగాలి పర్యటన కొనసాగుతోంది. ఈ ఎన్నికల సభలో పవన్ కళ్యాణ్ మరాఠీలో మాట్లాడడం అభిమానులకు ఆశ్చర్యం కలిగించింది. డెగ్లూర్ సభలో ఆయన ప్రసంగిస్తుండగా పవన్ రాబోయే చిత్రం ‘ఓజీ’ గురించి నినాదాలు చేశారు అభిమానులు. అయితే తాను శివాజీ పాలనను గుర్తు చేసుకోవడానికే వచ్చానని, ఓట్లు అడగడానికి రాలేదని పవన్ పేర్కొన్నారు. మరాఠా వీరులకు నివాళులర్పించడానికి వచ్చానని పేర్కొన్నారు పవన్. గతంలో పోలీసులు 15 నిమిషాలు కళ్లు మూసుకుంటే మా తడాఖా చూపిస్తానని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ వ్యాఖ్యానాలు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. శివాజీ పుట్టిన గడ్డలో వీరులు భయపడరని ధీమా వ్యక్తం చేశారు.