NewsTelangana

పటాన్ చెరువులో చిట్టీల పేరుతో ఘరానా మోసం

హైదరాబాద్ పటాన్ చెరులో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. చిట్టీల పేరుతో ఉమాదేవి అనే మహిళ ఈ మోసానికి పాల్పడింది. ఉమాదేవి పటాన్ చెరులోని స్థానికులతో చిట్టీలు కట్టించుకునేది.  ఆమె చాలా రోజులు నుంచి చిట్టీలు కట్టించుకుంటూ.. నమ్మకంగా ఉండేది దీంతో  అక్కడి స్థానికులందరూ..ఆమెను గట్టిగా  నమ్మి వాళ్ల కష్టార్జీతాన్ని తీసుకువచ్చి ఆమెకు కట్టేవారు. ఈ మేరకు అదును చూసి కాటు వేద్దామని అనుకుందో ఏమో తెలియదు గాని భారీగా వసూలు చేసిన చిట్టీ డబ్బుతో ఆమె ఈ నెల 9న అక్కడి నుంచి పరారయ్యింది. ఈ విషయం తెలుసుకున్న బాధితులు తమకు న్యాయం చేయాలంటూ జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని ఆశ్రయించారు. ఈ మేరకు ఉమాదేవి రూ.9 కోట్ల డబ్బుతో ఉడాయించినట్లు వారు తెలిపారు. ఉమాదేవిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.