Andhra PradeshNews Alert

రైల్వే స్టేషన్‌లో యువకుడి హల్‌చల్        

నెల్లూరు బిట్రగుంట రైల్వే స్టేషన్‌లో ఓ ప్రయాణికుడు హల్‌చల్ చేశాడు. సడన్‌గా రైల్వే విద్యుత్ స్తంభం పైకి ఎక్కి చనిపోతానంటూ వీరంగం సృష్టించాడు. ఈ క్రమంలోనే విద్యుత్త్ షాక్ తగిలి స్తంభంపై నుండి కిందకు పడిపోయాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు విచారణకు దిగారు. ఆ యువకుడు జార్ఖండ్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతని పేరు కండీర్‌గా తెలిపారు.