మరోసారి పార్లమెంటు సమావేశాలు వాయిదా
పార్లమెంటులో అదానీ వివాదంపై జేపీసీ ,రాహుల్‌పై అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. కాగా రాహుల్‌పై అనర్హత వేటు పడడంతో దేశరాజకీయాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ప్రస్తుతం ఈ విషయం దేశ రాజకీయాలలో హాట్ టాపిక్‌గా మారింది. మరోపక్క పార్లమెంటులో కూడా ఇది తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. దీంతో పార్లమెంటు ఉభయసభలు నిరసనలతో అట్టుడుకుతున్నాయి.ఈ నేపథ్యంలో ఈ రోజు మొదలైన పార్లమెంటు ఉభయసభలు ప్రతిపక్షాల ఆందోళనల నడుమ వాయిదా పడ్డాయి. వీటిని ఏప్రిల్ 3కు వాయిదా వేస్తున్నట్లు సభాపతులు ప్రకటించారు.