Home Page SliderNational

పార్లమెంట్ కేసు సూత్రధారి లలిత్ ఝా పోలీసులకు లొంగిపోయాడు

ఢిల్లీ: పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యం ఘటన కేసు మాస్టర్ మైండ్ లలిత్ ఝా అరెస్టు అయ్యాడు. తనంతట తానుగా వచ్చి ఢిల్లీ పోలీసులకు లొంగిపోయాడు. గురువారం రాత్రి లలిత్ ఝా మరో వ్యక్తితో కలిసి కర్తవ్య పథ్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. అతన్ని పోలీసు ప్రత్యేక బృందాలకు అప్పగించినట్లు పేర్కొన్నారు.

   మనోరంజన్, సాగర్ శర్మ, నీలమ్, అమోల్ శిందె, విశాల్, లలిత్ అనే ఆరుగురు దుండగులు ఈ ఘటనకు పాల్పడిన విషయం తెలిసిందే. ఇందులో మనోరంజన్, సాగర్ శర్మ లోక్‌సభలోకి చొరబడగా.. నీలమ్, అమోల్ శిందే పార్లమెంట్ భవనం వెలుపల గందరగోళం సృష్టించారు. ఈ నలుగురితోపాటు వీరికి బస ఏర్పాటు చేసిన విశాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఐదుగురి మొబైల్ ఫోన్స్‌తో పరారైన లలిత్ ఝా ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. పార్లమెంట్‌లో దుండగులను విచిత్రంగా ఎంపీలే పట్టుకొని పోలీసులకు అప్పగించారు. నిఘా వైఫల్యం మొత్తం ఫెయిలయ్యింది.