Home Page SliderNationalNews Alert

పాన్‌-ఆధార్‌ లింక్‌ గడువు తేదీ జూన్‌ 30 వరకు పొడిగింపు

పాన్‌-ఆధార్‌ లింక్‌ గడువు తేదీని జూన్‌ 30, 2023 వరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. పన్ను చెల్లింపుదారులకు ఇంకొంతకాలం సమయం ఇచ్చేందుకు గడువు పొడిగిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆధార్‌ నెంబర్‌ను 2023 మార్చి31లోగా పాన్‌ కార్డుకు లింక్‌ చేయాలని తెలిపింది. తాజాగా దానిని జూన్‌ 30 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. పాన్‌-ఆధార్‌ లింక్‌ గడువును మరో ఆరు నెలలు పొడిగించాలని.. రూ. 1000 రుసుమును కూడా తొలగించాలని విజ్ఞప్తి చేస్తూ లోక్‌సభలో కాంగ్రెస్‌ నేత అధీర్‌ రంజన్‌ చౌదరి ప్రధాని మోదీకి లేఖ రాసిన కొద్ది రోజులకే ఈ ప్రకటన వెలువడింది.